అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదు: సీఐ

అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదు: సీఐ

VKB: మొంథా తుఫాన్ ప్రభావంతో అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని ధారూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రఘురాం సూచించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు పొలాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు. చెరువులు, వాగుల వద్ద చేపలు పట్టేందుకు వెళ్లొద్దన్నారు. అత్యవసరమైతే డయల్ 100కు కాల్ చేయాలని చెప్పారు.