హిందూపురంలో కార్మికులకు కిట్లు పంపిణీ
సత్యసాయి: హిందూపురం పురపాలక కార్యాలయంలో మరుగుదొడ్లు, పారిశుద్ధ కార్మికులకు శుక్రవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లను పరిశుభ్రపరిచే కార్మికులు అనారోగ్య పాలవకుండా ప్రత్యేక కిట్లు( డ్రెస్, హెల్మెట్, మాస్క్, షూస్, హ్యాండ్ బ్లౌజ్ )లు పంపిణీ చేశారు.