బాసర ఆలయంలో ఒక్క రోజు ఆదాయం రూ.6 లక్షలు

ADB: వేసవి సెలవులు శుక్రవారం శుభదినం కావడంతో బాసర అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం, అక్షరాభ్యాసాల కోసం భక్తులు బారులు తీరారు. దీంతో దర్శనానికి గంట సమయం, అక్షరాభ్యాసం కోసం అరగంట సమయం పట్టింది. కాగా ఆలయంలో 452 అక్షరాభ్యాసాలు జరిగాయి. ఆలయానికి రూ.6 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.