హ్యాండ్‌బాల్ పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి
ప్రకాశం: నవంబర్ 23,24,25 తేదీల్లో సింగరాయకొండలోని ARC & GVR జూనియర్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్ జిల్లాల హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ జరగనుంది. టోర్నమెంట్‌కు సంబంధించిన సంబంధించిన పోస్టర్‌ను మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదివారం ఆవిష్కరించారు. టోర్నమెంట్ విజయవంతం చేయాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు.