పరిగి అభివృద్ధికి నిధులు మంజూరు
VKB: పరిగి పురపాలిక సంఘాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. ఇటీవల పరిగి మున్సిపాలిటీకి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కింద సుమారు రూ. 45 కోట్లు వెచ్చిస్తున్నారు. నిధులు వస్తుండడంతో ఆయా కాలనీల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. పనులు పక్కాగా అమలు చేసేలా అధికారుల పర్యవేక్షణ ఉండాలని స్థానికులు కోరుతున్నారు.