కాఫీ పంటలపై తెగుళ్ల సర్వే

కాఫీ పంటలపై తెగుళ్ల సర్వే

అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని గరడగూడ, ఇరగాయి, పకనగూడలో కాఫీ పంటలకు తెగులు సోకినట్టు ఉద్యాన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటివరకు 154 ఎకరాల్లో తెగులు ప్రభావం కనిపించినట్లు అధికారులు గుర్తించారు. 85 ఎకరాలు రెడ్ జోన్, 69 ఎకరాలు ఎల్లోజోన్‌గా ప్రకటించారు. యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు ప్రారంభించారని అధికారులు తెలిపారు.