'మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా'
KKD: గొల్లప్రోలు సూరంపేట ఒకటో వార్డులో నీటి సమస్య, రోడ్డు సమస్యపై సుమారు 200 మంది మహిళలు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామికి తమ గోడును వెళ్ళబుచ్చారు. గొల్లప్రోలు మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులతో కలిసి రామస్వామి సూరంపేట వెళ్లి అక్కడ సమస్యలను పరిశీలించారు. ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను వెంటనే తీసుకువెళ్లి పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు.