రైలు ఢీకొని వృద్ధురాలు మృతి

రైలు ఢీకొని వృద్ధురాలు మృతి

అన్నమయ్య: వాల్మీకిపురంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. స్థానిక ఐఏవై కాలనీకి చెందిన మస్తానమ్మ (70) ఆదివారం కాలనీ నుంచి రోడ్డు పైకి వచ్చేందుకు రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.