జగన్ పాలనలో రైతులకు మోసం: ప్రత్తిపాటి

GNTR: జగన్ పాలనలో రైతులను మోసం చేశారని చిలకలూరిపేట MLA ప్రత్తిపాటి పుల్లారావు గురువారం విమర్శించారు. RBKలను 'రైతు బాధిత కేంద్రాలుగా' మార్చారని ఆరోపించారు. ఎరువులు, విత్తనాలు, టార్పాలిన్‌లు పక్కదారి పట్టించారని, ధాన్యం కొనుగోలు డబ్బులు సైతం బకాయిలు పెట్టారని ఆయన మండిపడ్డారు. వైసీపీ పాలనలో రైతులు యూరియా కోసం పడిగాపులు పడ్డారని గుర్తుచేశారు.