రోడ్డు పనులు పరిశీలించిన కార్పొరేట్

మేడ్చల్: చర్లపల్లి డివిజన్ పరిధిలోని మింట్ కాలనీలో 400 మీటర్ల రోడ్డు పనులను కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రోడ్డుపై జరుగుతున్న పలు నిర్మాణాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు డీఈ బాలకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాలనీవాసులు పలువురు పాల్గొన్నారు.