రైలులో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

రైలులో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

ATP: తాడిపత్రి మండల పరిధిలోని కోమలి రైల్వే స్టేషన్ ప్రాంతంలో దోపిడీదారులు రెచ్చిపోయారు. ముంబై నుంచి చెన్నై వెళ్తున్న చెంగల్ పట్టు ఎక్స్‌ప్రెస్‌లోకి దొంగలు చొరబడ్డారు. S1, S2 భోగిల్లో దోపిడీ చేశారు. ఇవాళ తెల్లవారుజామున మూడు తులాల బంగారం అపహరించినట్లు తెలుస్తోంది. ఇటీవల గుత్తి వద్ద రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లోనూ చోరీ జరిగిన విషయం తెలిసిందే.