‘పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలి’
AKP: కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు బాగా రాయాలంటూ.. 9వ తరగతి విద్యార్థులు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. శనివారం హైస్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు అట్టలు, పెన్నులు అందజేశారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుకుమార్ పాల్గొన్నారు.