వాడపల్లి వెంకన్నకు భారీగా ఆదాయం

కోనసీమ: తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకల నుంచి భారీ ఆదాయం లభించింది. 28 రోజులకు గాను రూ.1,52,91,193 ఆదాయం వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్, ఈవో నల్లం సూర్య చక్రధర్ రావు వెల్లడించారు. గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో, బయట, అన్న దాన సత్రంలో ఉన్న అన్ని హుండీలు లెక్కించారు.