విద్యుత్ ప్రభలను సందర్శించిన మాజీమంత్రి

విద్యుత్ ప్రభలను సందర్శించిన మాజీమంత్రి

PLD: చిలకలూరిపేట మండలం బొప్పూడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 43వ వార్షికోత్సవ తిరునాళ్లలో మాజీ మంత్రి విడదల రజిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలను ఆమె సందర్శించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు, పార్టీ శ్రేణులతో సందడి నెలకొంది.