ఒక రోజు తేడాలో భార్యాభర్తలు మృతి

NLG: మునుగోడు మండలం పలివెల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దుబ్బ శంకరయ్య ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. భర్త మరణించిన విషయాన్ని తట్టుకోలేక భార్య లచ్చమ్మ తీవ్రంగా రోదిస్తూ సోమవారం మధ్యాహ్నం మరణించింది. భార్యాభర్తలు ఒక రోజు తేడాలో చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్యాభర్తల దహన సంస్కారాలు నేడు జరగనున్నాయి.