ప్రజా సమస్యలను తెలుసుకున్న కనిగిరి ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ 9వ వార్డులో ఆదివారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పర్యటించారు. 'ఛాయ్ 3. O' కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గతంలో ప్రతిపక్ష హోదాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తన దృష్టికి రాని సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి ప్రజల మధ్య తిరుగుతున్నానని, ఎటువంటి సమస్యలైనా వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.