VIDEO: శరవేగంగా రోడ్డు నిర్మాణ పనులు
కృష్ణా: గుడివాడలోని 3వ వార్డులోని నాలుగవ లైన్ రోడ్డు నిర్మాణ పనులను ఆ వార్డు టీడీపీ ఇంఛార్జ్ అడుసుమిల్లి శ్రీనివాసరావు సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణ పనులు ప్రస్తుతం వేగవంతంగా కొనసాగుతున్నాయని, ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానిక నివాసితుల రాకపోకులకు మరింత సులభతరం కానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికలు పాల్గొన్నారు.