చిరస్మరణీయుడు శ్రీకాంతాచారి : వెంకటాచారి

NLG: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి జయంతిని నల్లగొండలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గడియారం సెంటర్‌లో గల శ్రీకాంతాచారి విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మను, మయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటోజు వెంకటాచారి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి ఉద్యమ స్ఫూర్తి, త్యాగం చిరస్మరణీయమన్నారు.