'సుల్తానాబాద్ మండలంలో మానేరుకు వెళ్లే రహదారుల మూసివేత'

'సుల్తానాబాద్ మండలంలో మానేరుకు వెళ్లే రహదారుల మూసివేత'

PDPL: సుల్తానాబాద్ మండలంలో మానేరుకు వెళ్లే రహదారులను శుక్రవారం మూసివేసినట్లు ఎంపీడీవో దివ్యదర్శనరావు తెలిపారు. ఎల్ఎండీ ఎనిమిది గేట్లు ఎత్తినందున నీటి ప్రవాహం పెరగనుండడంతో మానేరు పరివాహక గ్రామాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు, ఇసుక ట్రాక్టర్ల యజమానులు వాగుకు వెళ్లొద్దని కోరారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లో డప్పు చాటింపు వేయించాలన్నారు.