జిల్లా ప్రధానకార్యదర్శిగా సలీం నియామకం
AKP: బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా కమిటీలో రోలుగుంట మండలం కొవ్వూరుకు చెందిన సీనియర్ నేత షేక్ సలీంకు జిల్లా ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. శనివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు పరమేశ్వర రావు, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు షేక్ బాజ్జిల చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.