అమానుషం.. 8వ తరగతి బాలికకు వివాహం

అమానుషం.. 8వ తరగతి బాలికకు వివాహం

CTR: పుంగనూరు నియోజవర్గంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తల్లితండ్రులు విడిపోయి వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో తండ్రికి తెలియకుండా తల్లి ఎదురు కట్నం తీసుకొని 8వ తరగతి చదువుతున్న తన కూతురికి 54 సంవత్సరాల వ్యక్తితో రెండు రోజుల క్రితం వివాహం జరిపించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాలికను రక్షించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.