VIDEO: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ప్రత్యేక ఏర్పాట్లు

AKP: పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష బుధవారం జరుగుతున్న నేపథ్యంలో నర్సీపట్నం పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకున్నారు. నర్సీపట్నంలో పరీక్షల కొరకు 7 సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 2448 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని కో ఆర్డినేటర్ నరసింహం తెలిపారు. పరీక్ష వద్ద ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యం కల్పించారు.