ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సత్తా
SKLM: సైనిక్ పాఠశాలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఎంపికై సత్తా చాటాడు. మందస ఎంపీపీ స్కూల్ కొంకడాపుట్టిలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థి సవర జాన్ జస్టిస్ ఇటీవల నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా కోరుకొండ సైనిక పాఠశాలకు పోటీ పరీక్షలు ద్వారా ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా మండల MEO లక్ష్మణరావు బుధవారం విద్యార్థిని ఘనంగా సన్మానించారు.