జోగులాంబ అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

జోగులాంబ అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా దేవరకద్ర శాసనసభ్యులు జీ.మధుసూదన్ రెడ్డి దంపతులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.