ఎండ వేడికి కోళ్ల మృత్యువాత!

ఎండ వేడికి కోళ్ల మృత్యువాత!

MDCL: శామీర్‌పేట్, కీసర పరిసర ప్రాంతాలలో ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కోళ్ల ఫారాల్లో భారీగా కోళ్లు మృతి చెందుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక వందల సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో ఫారమ్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. తగిన శీతలీకరణ ఏర్పాట్లు లేకపోవడం, నీటి కొరత ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.