శ్యాంగడ్ హత్య కేసు ఛేదన.. ఇద్దరు అరెస్ట్

శ్యాంగడ్ హత్య కేసు ఛేదన.. ఇద్దరు అరెస్ట్

NRML: పట్టణంలోని శ్యాంగడ్ సమీపంలో జరిగిన హత్య కేసును నిర్మల్ టౌన్ పోలీసులు త్వరితగతిన ఛేదించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా... మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వ్యక్తిగత వివాదాల కారణంగా మృతుడిని మద్యం తాగించి, దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మిగతా నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.