ప్రభుత్వ భూములు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి
AP: ప్రభుత్వ భూములను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రైతు భూమి కబ్జా అంశంపై మాజీమంత్రి బుగ్గన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖ పూర్తిగా అస్తవ్యస్థమైందని ధ్వజమెత్తారు. ధన దాహంతో సరిహద్దు రాళ్లపై బొమ్మలు వేసుకున్న చరిత్ర YCPదని దుయ్యబట్టారు.