VIDEO: ఐనవోలులో అక్రమ ఇసుక తవ్వకాలు

VIDEO: ఐనవోలులో అక్రమ ఇసుక తవ్వకాలు

HNK: ఐనవోలు మండలం లింగమారిగూడెం, నందనం గ్రామాల పరిధిలోని ఆకేరు వాగు శివారులో జేసీబీలతో అక్రమంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా భారీ చెట్లకు, పంట భూములకు నష్టం జరుగుతుండటంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ నష్టం వాటిల్లుతోందని మంగళవారం తెలిపారు. అక్రమ ఇసుక దందాపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.