పంచాయతీ ఎన్నికల బరిలో ట్రాన్స్‌జెండర్
JGL: ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ శ్రీప్రేమ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా తమ గ్రామంలోని 9వ వార్డుకు నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి, శుభ్రత, పేదల సంక్షేమం, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి అర్హులైన కుటుంబానికి చేరవేయాలని లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రేమ తెలిపారు.