నేడు నీటి సరఫరాకు అంతరాయం
JN: పట్టణ పరిధిలోని చీటకోడూర్ రిజర్వాయర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద మరమ్మత్తులు జరుగుతున్నందున మంగళవారం నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని మునిసిపల్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే మరమ్మత్తులు నేపథ్యంలో.. రానున్న (20) రోజుల పాటు సరఫరా అయ్యే నీటిని ప్రజలు త్రాగునీరుకు కాకుండా ఇతరత్రా అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని కోరారు.