'రైతులకు రాయితీపై పనిముట్లు'

'రైతులకు రాయితీపై పనిముట్లు'

KDP: రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసినట్లు గురువారం ముద్దనూరు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. 2024-25 సంవత్సరానికి ఎస్ఎంఏఎం పథకం ద్వారా పవర్ స్పేయర్లు, విత్తన డ్రిల్లు, గుంటకలు, రోటోవేటర్లు, ట్రాక్టర్ స్ప్రేయర్లను అర్హులైన రైతులకు రాయితీపై అందించామని ఆయన చెప్పారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.