VIDEO: ఘటనపై ఆరా తీసిన రూరల్ ఎస్సై శ్రీకాంత్
KDP: గోపవరం మండలం రాచాయిపేట సమీపంలో మహేశ్వర్ రెడ్డి స్కూల్ బస్సు చెరువు కట్టపైకి చేరిన ఘటన స్థలానికి రూరల్ ఎస్సై శ్రీకాంత్, ఆయన సిబ్బంది చేరుకున్నారు. సంఘటన స్థలంలో వివరాలు సేకరించిన ఎస్సై, స్కూల్ పిల్లలందరూ క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. జెసిబి సహాయంతో బస్సును బయటకు తీసి, పిల్లలను సురక్షితంగా వారి గ్రామాలకు తరలించారు.