భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పరిశీలన

భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పరిశీలన

VSP: ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. జేసీ మయూర్‌ అశోక్‌తో కలిసి ఆయన ఆదివారం ఈ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సమయం చాలా తక్కువగా ఉన్నందున ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు.