తాడిపత్రిలో మెగా జాబ్ మేళా

ATP: ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రిలో మెగా జాబ్ మేళా జరగనుంది. సంజీవ్ నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 13న మేళా నిర్వహించనున్నారు. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన యువతీ, యువకులు అర్హులని నిర్వాహకులు తెలిపారు. తగిన ధ్రువీకరణ పత్రాలతో మేళాలో పాల్గొనాలని సూచించారు.