ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

KMM: ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తనిఖీ చేశారు. కలెక్టర్ గోడౌన్లోని సీల్ను, లోపల ఉన్న ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పరిశీలించారు. ఫైర్ అలారం, అగ్నిమాపక యంత్రాలు, స్లాబ్, డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. సీసీ కెమెరాల పనితీరు, సెక్యూరిటీ అప్రమత్తతపై ఆయన స్పష్టమైన సూచనలు ఇచ్చారు.