11 సీట్లు ఇచ్చినా వైసీపీకి బుద్ధి రాలేదు: ఎమ్మెల్యే
NLR: గత వైసీపీ పాలనలో అవినీతి రాజ్యమేలిందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. శనివారం కందుకూరు టీడీపీ కార్యాలయంలో ఆయన CMRF చెక్కులను పంపిణీ చేశారు. గత వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రజా సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు.