వైసీపీ జిల్లా అధ్యక్షుడికి నోటీసులు
VZM: వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుకు మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. విజయనగరంలో వైసీపీ కార్యాలయానికి ఫైర్ అండ్ సేఫ్టీ అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగాయని నోటీసులు జారీ చేశారు. వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.