భార్యను రాయితో కొట్టి చంపిన భర్త
PLD: నరసరావుపేట మండలం ములకలూరులో మంగళవారం దారుణం జరిగింది. పాత సామాన్లు ఏరుకుంటూ జీవనం సాగించే వెంకయ్య, తన భార్య ఆదరత్తమ్మ (41)ను రాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. నెల్లూరు వనంతోపు సెంటర్‌కు చెందిన వీరు, ఇసప్పాలెం మహంకాళి తిరునాళ్లకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.