'రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి'

'రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి'

AKP: రసాయనకి ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రైతులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం రాంబిల్లి మండలం వెంకటాపురంలో రైతన్న మీకోసం వర్క్ షాప్‌లో పాల్గొన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందులు మోతాదుకు మించి వినియోగిస్తే ఇబ్బందులు కలుగుతాయన్నారు. పర్యావరణ పరంగా హాని జరుగుతుందన్నారు. గాలి, నీరు, ఆహారం, కలుషితం కాకుండా చూడాలన్నారు.