కొంకలలో పశువులకు గాలి కుంటు నివారణ టీకాలు

కొంకలలో పశువులకు గాలి కుంటు నివారణ టీకాలు

GDWL: వడ్డేపల్లి మండలం కొంకలలో గురువారం పశువులకు గాలి కుంటు నివారణ టీకాలను మండల పశువైద్యురాలు డాక్టర్ స్వరూప రాణి వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పశువుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, రైతులు ఆర్థికంగా మెరుగుపడాలని ఉచితంగా టీకాలు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 126 పశువులకు టీకాలు వేశారన్నారు.