ప్రజల ఆశ, అత్యాశే మోసగాళ్ల ఆయుధం: ఎస్పీ
NRPT: డబ్బుపై ప్రజలకు ఉండే ఆశ, అత్యాశే సైబర్ మోసగాళ్లకు ఆయుధాలని ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ మోసంలో నష్టపోయి బాధపడటం కంటే అవగాహనతో ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమన్నారు. స్మార్ట్‌ఫోన్లకు వచ్చే అనవసరపు లింకులు, ఏపీకే ఫైల్స్‌ను తెరవకుండా ఉండటం మంచిదని సూచించారు. ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.