కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో రీకౌంటింగ్ కలకలం
WGL: వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ చరిత్రలో తొలిసారి రీకౌంటింగ్‌లో ఫెయిలైన ఐదుగురు పీజీ వైద్య విద్యార్థులు మళ్లీ పాస్ కావడంతో తీవ్ర వివాదం నెలకొంది. ప్రైవేట్ వైద్య కళాశాలలకు చెందిన వీరికి అక్రమంగా మార్కులు జోడించి, డబ్బులు తీసుకుని ఉత్తీర్ణులను చేశారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత నెల 4న ప్రకటించిన ఫలితాల తర్వాత ఈ విషయం బయట పడింది.