శ్రీశైలంలో అన్యమత స్టిక్కర్ల కారు కలకలం
NDL: శ్రీశైల క్షేత్రంలోకి అన్యమత స్టిక్కర్లతో ఓ కారు ప్రవేశించడం కలకలం సృష్టించింది. ఈ కారును గమనించిన ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ నాయకులు దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు. తనిఖీ చేసిన సెక్యూరిటీ సిబ్బంది కారులో బైబిల్, కరపత్రాలను గుర్తించారు. ఈ ఘటనపై దేవస్థానం సీఎస్‌ఓ శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.