VIDEO: ఘట్‌కేసర్, పోచారం రహదారుల పరిస్థితి ఇది..!
MDCL: ఘట్‌కేసర్ పరిసర ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి దయనీయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత రహదారి, అంబేద్కర్ రోడ్, పోచారం మెయిన్ రోడ్, అన్నోజిగూడ సర్వీస్ రోడ్, రాజు గృహకల్ప మార్గాలు గుంతలతో నిండిపోయాయని తెలిపారు. పన్నులు కడుతున్నా పనులు జరగడం లేదని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.