రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

మేడ్చల్: పోలీసు స్టేషన్ పరిధి జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా బైకుపై వెళ్తున్న సామల రవితేజను గుర్తుతెలియని వాహనం వెనక నుంచి ఢీ కొట్టింది. దీంతో రవితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.