పిల్లలకు తరచూ తలనొప్పి వస్తోందా?

పిల్లలకు తరచూ తలనొప్పి వస్తోందా?

పిల్లలకు తరచూ తలనొప్పి రావడం మంచిది కాదని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. పాఠశాలలో ఒత్తిడి, మొబైల్, టీవీ ఎక్కువగా చూడడం, నిద్ర సరిపోకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు వలన తలనొప్పి వస్తుంది. తలనొప్పితో పాటు వాంతులు, చూపు మందగించడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. శారీరక శ్రమ కలిగిన ఆటలు ఆడించాలి.