శ్రీశైలం ప్రాజెక్టుకు వరద.. 3 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద.. 3 గేట్లు ఎత్తివేత

AP: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. డ్యామ్ గేట్లను ఎత్తడం ఈ ఏడాదిలో ఇది ఐదోసారి కాగా.. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 2.26 లక్షలు, ఔట్‌ఫ్లో 1.49 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 883.9 అడుగులకు చేరింది. ఇక కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.