VIDEO: వైభవంగా మహాలక్ష్మి అమ్మవారి జాతర

VIDEO: వైభవంగా మహాలక్ష్మి అమ్మవారి జాతర

కోనసీమ: పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి జాతర మహోత్సవాలు బుధవారం రాత్రి వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గరగ నృత్యాలు సందడితో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.