గత ఐదేళ్లలో అవినీతిమయం: ఎమ్మెల్యే

PLD: గత ఐదేళ్లలో అవినీతిమయమైందని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజుపాలెం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి ఎమ్మెల్యే స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. సంబంధిత అర్జీలు వెంటనే అధికారులకు పంపించి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు.