VIDEO: కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల పోటాపోటీ నినాదాలు
ఆదిలాబాద్ మున్సిపల్ మొదటి సర్వసభ్య సమావేశం కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య రాజకీయ వేడి నెలకొంది. ఈ క్రమంలో మున్సిపల్ కార్యాలయంలో ఇరువురు పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు బీజేపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. మరోవైపు నుంచి బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.